భవన నిర్మాణ పనులు ప్రారంభించిన కార్పోరేటర్

మేడ్చల్: ఓల్డ్ బోయిన్‌పల్లి 119 డివిజన్ ముస్లిం బస్తీలో మర్కజ్ ఈ అహ్లే సున్నత్ బర్కత్ ఈ రజా భవన నిర్మాణ పనులను కార్పోరేటర్ నరసింహ యాదవ్ సోమవారం ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న భవన నిర్మాణం ప్రారంభించడం సంతోషాన్ని కలిగించిందని ఆయన అన్నారు. ముద్దం మహేష్ యాదవ్, నాసిర్ ఖాన్, సలీం, వసీం, జమీర్, రజాఖాన్, అమీర్ రజా, ఇబ్రహీం, బుర్రి యాదగిరి పాల్గొన్నారు.