ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జనసేనలోకి చేరికలు

E.G: రాజానగరం మండలం పరిజల్లి పేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు,కార్యకర్తలు సోమవారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎనిమిదో వార్డు వెంటపాటి రమణ, రవికుమార్ 7వ వార్డు, కొత్తపల్లి అర్జున్, జుత్తుక చిన్నారి, చాపల శ్రీను, ఆకుమర్తి అబ్బులు, ఆబోతు లక్ష్మి తదితరులు సుమారు 29 మంది పైగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరారు.