ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన

ప్లాస్టిక్ వాడకంపై ప్రజలకు అవగాహన

అన్నమయ్య: ప్లాస్టిక్ రహిత సమాజంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎస్. రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. మదనపల్లె మండలంలోని చండ్రమాకుల పల్లె గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.