బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి 5 ఏళ్ల జైలు
KDP: బి.కోడూరు మండలం అక్కుపాలెంలో 2019లో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి బద్వేలు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి వై.జె పద్మశ్రీ ఐదేళ్ల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించారు. ఓబయ్య అలియాస్ నవీన్ కిడ్నాప్ చేసినట్లు రుజువుకావడంతో ఇవాళ తీర్పు చెప్పారు. కేసులో సహకరించిన పోలీసులను ఎస్పీ నచికేత్ అభినందించారు.