VIDEO: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద

మంచిర్యాల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 8 గేట్లు ఎత్తి 53,050 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 19.064 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 53,050 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 53,050 క్యూసెక్కులుగా ఉంది.