VIDEO: పెద్దకడబూరులో నాసిరకం డ్రైనేజీ పనులు

VIDEO: పెద్దకడబూరులో నాసిరకం డ్రైనేజీ పనులు

KRNL: ప్రభుత్వం గ్రామాల్లో CC రోడ్లు, డ్రైనేజీలకు లక్షలు వెచ్చిస్తే పెద్దకడబూరు 5వ వార్డులో రూ. 10లక్షలతో చేపడుతున్న డ్రైనేజీ పనులు అత్యంత నాసిరకంగా జరుగుతున్నాయని కాలనీవాసులు మండిపడుతున్నారు. తాజాగా నిర్మించిన డ్రైనేజీలు కొద్ది రోజులకే ఎక్కడిక్కడ ఊడిపోతుండటంతో కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.