జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో రూ.18కే గోధుమ పిండి

జనవరి 1 నుంచి రేషన్ షాపుల్లో రూ.18కే గోధుమ పిండి

KDP: రాష్ట్రంలోని రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పట్టణాల్లోని రేషన్‌ షాపుల్లో గోధుమపిండి కిలో రూ.18 చొప్పున లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది. ఇందుకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ విషయంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి కేజీ గోధుమ పిండిని సరఫరా చేయనున్నట్లు రేషన్ సంబంధిత అధికారులు వెల్లడించారు.