వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్

BHPL: ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఎండలు, వడగాలులతో జరిగే ప్రమాదాలు పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. వేసవికాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయన్నారు.