VIDEO: ఘనంగా అయ్యప్ప స్వామి రథయాత్ర
AKP: నర్సీపట్నంలో ఇవాళ సాయంత్రం అయ్యప్ప స్వామి రథయాత్ర ఘనంగా నిర్వహించారు. 35 సంవత్సరాల క్రితం స్థాపించిన అయ్యప్ప ఆలయం వద్ద గత కొన్నాళ్లుగా కార్తీకమాసం మూడవ సోమవారం అయ్యప్ప స్వామి రథయాత్రను నిరాటకంగా కొనసాగిస్తున్నారు. అయ్యప్ప దర్శనానికి రాలేని సామాన్య భక్తుల కొరకు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకువెళ్లి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.