బాల్యవివహాలపై అవగాహన కార్యక్రమం

బాల్యవివహాలపై అవగాహన కార్యక్రమం

NLG: బాల్యవివహాలు,అక్రమ దత్తత వల్ల కలిగే పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చందంపేట మండలం కోరుట్ల పరిధిలో మంగళవారం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ప్రసన్న ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్లల అక్రమ దత్తత, భ్రూణ హత్యల వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆడపిల్లలను పుట్టనివ్వాలని, బ్రతకనివ్వాలని, ఎదగనివ్వాలని సూచించారు.