హెచ్1బీ వీసా ప్రక్రియ పునఃప్రారంభం!
యూఎస్‌లోని ఆఫీస్ ఆఫ్ ఫారెన్ లేబర్ సర్టిఫికేషన్(OFLC) సేవలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా దాదాపు నెల రోజులుగా నిలిచిపోయిన ఈ సేవలు ప్రారంభించినట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ ప్రకటించింది. తాత్కాలిక, శాశ్వత ఉద్యోగావకాశాల కోసం యూఎస్ వచ్చే వారి దరఖాస్తుల ప్రాసెస్ ప్రక్రియను ప్రారంభించింది.