రహదారుల నాణ్యత పరిశీలించిన ఎమ్మెల్యే
కృష్ణా: చల్లపల్లి మండలం నాదెళ్లవారిపాలెం, రాముడుపాలెం గ్రామాల్లో జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శనివారం స్వయంగా పరిశీలించారు. డిప్యూటీ సీఎం పవన్ 'పల్లె పండుగ' కార్యక్రమంలో భాగంగా మంజూరు చేసిన రూ. 98 లక్షల ఉపాధి హామీ నిధులతో ఈ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.