ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు: కౌన్సిలర్
HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామని కౌన్సిలర్ అల్లే దశరథం తెలిపారు. 22వ వార్డు పరిధిలో చేపడుతున్న నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను కౌన్సిలర్ పరిశీలించి పలు సూచనలను చేశారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని, అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కౌన్సిలర్ కోరారు.