పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
NGKL: ఎన్నికల సమయంలో అక్రమ మద్యం,డబ్బు నిషేధిత వస్తువుల రవాణాపై పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్ ఆదేశించారు. మున్ననూర్‌లోని అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్‌ను ఆయన తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి వాహనం, వ్యక్తులను పూర్తిగా తనిఖీ చేయాలని చెక్ పోస్ట్ సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.