'వ్యర్థాలను పంట కాలవల్లో కలపొద్దని వినతిపత్రం'

'వ్యర్థాలను పంట కాలవల్లో కలపొద్దని వినతిపత్రం'

KKD: పంట కాలువల్లోకి చేపలు, రొయ్యల చెరువులకు సంబంధించిన వ్యర్థాలను కలపవద్దని ఈస్ట్ గోదావరి డెల్టా ఛైర్మన్ మొరాలశెట్టి సునీల్ కుమార్ కోరారు. పిఠాపురం‌లో చెరువుల నుంచి మోటార్లను ఉపయోగించి స్లడ్జి, మురికి నీటిని కాలువల్లోకి తోడటం వలన బురద పేరుకుపోయి, నీటి సామర్థ్యం తగ్గుతోందని తెలిపారు. ఈ మేరకు ఫిషరీస్ డీఎఫ్ కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు.