హాకీ WC: భారత్-పాక్ ఫైట్ ఎప్పుడంటే..?

హాకీ WC: భారత్-పాక్ ఫైట్ ఎప్పుడంటే..?

ఈ ఏడాది ఆగస్టులో జరిగే హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ టైటిల్‌ వేట ప్రారంభించనుంది. పూల్‌ ‘డి’లో ఉన్న టీమిండియా, ఆగస్టు 16న వేల్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడుతుంది. అనంతరం ఆగస్టు 18న ఇంగ్లండ్‌తో, ఆగస్టు 20న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది. తదుపరి దశకు చేరాలంటే భారత్‌ కచ్చితంగా గ్రూప్‌లో మొదటి 2 స్థానాల్లో నిలవాలి.