డిసెంబర్ 13న నగరానికి దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు
HYD: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఒక ప్రముఖ బ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన నగరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నట్లు తెలుస్తోంది. 'తెలంగాణ-2047' రైజింగ్‌లో భాగంగా మెస్సీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని సీఎం కోరనున్నట్లు సమాచారం.