ఆదోనిని జిల్లాగా రూపకల్పన చేయాలి: ADJU

KRNL: ఆదోని డివిజన్‌లో ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ (ADJU )రాష్ట్ర అధ్యక్షుడు మగ్దుం భాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆదోనిని జిల్లాగా రూపకల్పన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ.. ఆదోని జిల్లాగా ఏర్పాటైతే అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.