బైక్‌ను ఢీకొన్న టిప్పర్.. వ్యక్తి మృతి

బైక్‌ను ఢీకొన్న టిప్పర్..  వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ పరిధిలో ఘోర రోడ్దు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీ అడ్డ రోడ్ వద్ద కంకర్ టిప్పర్ ద్విచక్రాన్ని ఢీకొనడంతో వాహనదారుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడుని మహంకాళి గూడెం వాసిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.