VIDEO: ఓట్ల చోరీని నిలిపివేయాలంటూ ధర్నా

VIDEO: ఓట్ల చోరీని నిలిపివేయాలంటూ ధర్నా

GNTR: గుంటూరు పొన్నూరు రోడ్డులో సోమవారం సాయంత్రం ఓట్ల జాబితాలోని అక్రమాలపై సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మాట్లాడుతూ.. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడి అని మండిపడ్డారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.