షాపింగ్ మాల్‌ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: జిల్లా కేంద్రంలోని వాసవి షాపింగ్ మాల్‌ను శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షాపింగ్ మాల్ యజమానులు ఎమ్మెల్యేను కేరళ వాయిద్యాలతో ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యేను వారు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్, షాపింగ్ మాల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.