మాతృత్వానికి భరోసా.. ఉత్తమ సేవలకు దక్కిన గుర్తింపు

మాతృత్వానికి భరోసా.. ఉత్తమ సేవలకు దక్కిన గుర్తింపు

KMR: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాల్లో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక కాన్పులు నిర్వహించి రికార్డు సృష్టించినందుకు గాను ఈ ఎంపిక జరిగింది. నేడు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ చేతులమీదుగా DCHS విజయ భాస్కర్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.