మామిడి వ్యాపారంలో బాట'సింగారం'

HYD: సిటీ శివారులోని బాటసింగారం మార్కెట్ యార్డు మామిడి వ్యాపారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సీజన్లో రూ.2.22 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ మొత్తం ఇంకా పెరగనుంది. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటక నుంచి ఇక్కడికి పంటను తీసుకొస్తారు. రోజుకు 1,500 వాహనాల్లో సరుకు వస్తోంది. గ్రేడింగ్ చేసిన అనంతరం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.