విశాఖ ఉక్కు విషయంలో కూటమి ప్రభుత్వం మోసం చేసింది: కే.కే.రాజు

విశాఖ ఉక్కు విషయంలో కూటమి ప్రభుత్వం మోసం చేసింది: కే.కే.రాజు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయబోమని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేసిందని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కే.కే.రాజు అన్నారు. బీజేపీని ఒప్పించలేక ప్రజలకు వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. శనివారం విశాఖలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఇది స్పష్టమయింది అంటూ ఎన్నికల ముందు హామీ వీడియోను ఆదివారం విడుదల చేశారు.