98.44 శాతం రూ.2 వేల నోట్లు వెనక్కి: ఆర్‌బీఐ
చలామణిలో ఉన్న 98.44% రూ.2 వేల నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని RBI వెల్లడించింది. FEB 28 నాటికి ఇంకా రూ.5,551 కోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. 2023, మే 19న రూ.2 వేల నోట్ల ఉపసంహరణ వెలువడే సమయానికి వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. పోస్టాఫీసుల నుంచి ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను RBIకి పోస్టల్ రూపంలో పంపి, తమ అకౌంట్లలో క్రెడిట్ చేయించుకోవచ్చు.