మధురవాడలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
VSP: జీవీఎంసీ పరిధిలో మధురవాడ జోన్-2, 7వ వార్డులో రూ.7.30 కోట్లతో 18 అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా తమకు తెలియజేయాలని సూచించారు.