"పిడుగు పడి రైతు మృతి"
HNK: పరకాల మండలం పోచారం గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుస మహిపాల్ (40) వర్షంలో వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు. దుక్కి దున్నుతున్న ఎద్దు కూడా చనిపోయింది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.