కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో సోమవారం సోమర్‌పేటకు చెందిన 80 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామాభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషికి ఆకర్షితులై తాము కాంగ్రెస్‌లో చేరినట్లు వారు తెలిపారు. ప్రజాశక్తిగా ఉంటూ పార్టీకి ప్రజలకు కొత్త బలం తీసుకురావడానికి ఎమ్మెల్యేకు అండగా ఉంటామని వారు ప్రకటించారు.