కలెక్టర్ ఆదేశాల మేరకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు
BDK: నేడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశామని డాక్టర్ దుర్గా భవాని పేర్కొన్నారు. పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో జరుగుతున్న అన్ని పోలింగ్ కేంద్రాలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశామని అన్నారు. 60 మందికి పైగా వైద్య సిబ్బంది, 108 అందుబాటులో ఉందని వెల్లడించారు.