గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

TPT: గూడూరు మండల పరిధిలోని పురిటిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని మణి అనే స్కూటరిస్ట్ మృతి చెందారు. నెల్లూరు నుంచి ఓడూరుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా, వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొనడంతో తలకు గాయాలయ్యాయి. ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.