సుంకేసుల బ్యారేజీకి 32,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

GDL: కర్ణాటకలోని హోస్పేట్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో రాజోలి మండల కేంద్రం సమీపంలోని సుంకేసుల బ్యారేజీకి వరద పెరిగింది. గురువారం సాయంత్రం బ్యారేజీకి ఇన్ ఫ్లో 32,000 క్యూసెక్కులు వస్తుంది. దీంతో బ్యారేజీ 7 గేట్లు ఒక మీటరు మేర ఎత్తి 30,884 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 2,012 క్యూ సెక్కులు, మొత్తం 32,896 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.