ఘనంగా తులసి దామోదర కళ్యాణం

ఘనంగా తులసి దామోదర కళ్యాణం

KNR: పవిత్ర కార్తీక మాసం, క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని కరీంనగర్లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో తులసి దామోదర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా, వేద మంత్రోచ్ఛారణలతో కళ్యాణం నిర్వహించగా, కన్నుల పండుగగా సాగింది. వేడుకల్లో పాల్గొన్న అశేష మహిళా భక్తులు తులసి, ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి, పూజలు చేశారు.