వీరయ్య చౌదరికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఉగ్ర

వీరయ్య చౌదరికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వినాయక చౌదరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వెంట పలువులు టీడీపీ నాయకులు ఉన్నారు.