'బైండ్ల కులస్తులకు గుర్తింపు పత్రాలు అందజేయాలి'

SDPT: బైండ్ల కులస్తులకు గుర్తింపు పత్రాలు అందజేసి ఆదుకోవాలని మండల అధ్యక్షుడు బైండ్ల పరుశరాములు కోరారు. శుక్రవారం తొగుట తహసీల్దార్ శ్రీకాంత్‌కు వినతి పత్రం అందజేశారు. కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నామని, గుర్తింపు పత్రాలు లేక సంక్షేమ పథకాలు అందడం లేదని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి రవీందర్, మురళి, జనార్ధన్, ఆనందం, నాగరాజు, రామస్వామి పాల్గొన్నారు.