ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం

NRML: భైంసా పట్టణంలో CPI, AITUC ఆధ్వర్యంలో 77వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి సీపీఐ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర నాయకులు శంకర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి ట్రస్ట్ భవన్‌లో ముగింపు సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.