'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
NZB: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సాయన్న సూచించారు. రుద్రూర్ ఆదర్శ పాఠశాల, కళాశాలలో సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కళా బృందం ప్రదర్శనలు నిర్వహించారు. ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు, మహిళల రక్షణ, మాదక ద్రవ్యాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై నాటికలు, పాటల రూపంలో బృందం ద్యారా వివరించారు.