VIDEO: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీపీఆర్‌పై అవగాహన
BHNG: రాజాపేట మండలంలోని పలు శాఖల అధికారులకు సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్)పై బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది. రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మోసెస్ రాజ్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్యాశాఖ, పోలీస్, విద్యుత్, ఆరోగ్య శాఖలతో పాటు అంగన్‌వాడీలకు శిక్షణ అధికారి డాక్టర్ విజయ్ సీపీఆర్‌పై అవగాహన కల్పించారు.