'వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అడ్డుకుంటాం'

SKLM: వేసవి సెలవుల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు తరగతులు నిర్వహిస్తే అడ్డుకుంటామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిగిలిపల్లి మదన్ కుమార్ హెచ్చరించారు. టెక్కలి లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవులు పూర్తి కాకుండానే ప్రైవేట్ పాఠశాలలో తరగతులు నిర్వహించడం సరికాదన్నారు.