'హామీలు అమలు చేయని సీఎంకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు'
WNP: ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఒకటంటే ఒకటి అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రేవల్లి మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేసీఆర్ తెలంగాణ సాధించిన తర్వాత ప్రణాళిక బద్ధంగా రాష్ట్ర అభివృద్ధి సాధించారని కొనియాడారు.