వావిలాల గోపాలకృష్ణ 21వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంబటి

గుంటూరు: సత్తెనపల్లిలో సోమవారం వావిలాల స్మృతి వనంలో 21 వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి అంబటి పాల్గొన్నారు. గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వావిలాలలా నిరాడంబరంగా, నిష్పక్షపాతంగా ఉండటం అందరికీ సాధ్యమయ్యే పని కాదని, అలాంటి మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించుకుని ఆయన విధానాలను ప్రజల్లో తీసుకెళ్లటం మంచిదన్నారు.