అంబులెన్స్ నిర్లక్ష్యం.. ఆగిపోయిన పసి ప్రాణం

అంబులెన్స్ నిర్లక్ష్యం.. ఆగిపోయిన పసి ప్రాణం

రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ప్రైవేట్ అంబులెన్స్ నిర్లక్ష్యానికి ఒక్క రోజు వయసున్న పసికందు బలయ్యింది. ఊపిరితిత్తుల సమస్యతో జైపూర్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ అయిపోయింది. తండ్రి గమనించి డ్రైవర్‌కు చెప్పి దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణం పోయింది. కళ్ల ముందే బిడ్డ చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.