SEIL చొరవతో మల్లికార్జున పురానికి మహర్దశ
NLR: తోటపల్లి గూడూరు మండలంలోని మల్లికార్జునపురంలో పలు అభివృద్ధి పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. పంచాయితీ కార్యాలయం భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండు మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. మల్లికార్జునపురం అభివృద్ధి బాధ్యతలను ఇపుడు SEIL కంపెనీ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు.