పొన్నూరు నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు

పొన్నూరు నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సులు

GNTR: పొన్నూరు నుంచి హైదరాబాద్‌కు ఇంద్ర ఏసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. స్థానిక RTC డిపోలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వీటిని ప్రారంభించారు. ప్రజల చిరకాల కోరిక మేరకు ఈ సౌకర్యం కల్పించారు. దీనివల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం అందుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.