బయటపడుతున్న సంగమేశ్వరాలయం..!
NDL: సప్తనదీ సంగమ ప్రాంతంలోని ప్రాచీన సంగమేశ్వరాలయం జలశయం నుంచి చిన్నచిన్నగా బయటపడుతోంది. జలాశయం నీటిమట్టం 843 అడుగులకు తగ్గడంతో ఆలయం ప్రహరి గోడ కింది భాగం వరకు మాత్రమే నీరు ఉంది. మరో వారం రోజుల్లో ఆలయం పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పురోహితులు ఇవాళ తెలిపారు. ఈ పరిణామం భక్తులలో ఆనందాన్ని నింపుతోంది.