భూ సర్వే గ్రామాలలో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ
VZM: వచ్చేనెల 2 నుంచి భూ రీసర్వే గ్రామాలలో పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తహసీల్దార్ శ్రీకాంత్ వెల్లడించారు. భూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో సవరణలకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. నెల్లిమర్ల మండలం కొండగుంపాంలో రైతులకు శనివారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.