కాంగ్రెస్ కార్యకర్త మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే
వనపర్తి పట్టణం 12వ వార్డు రాజనగరంకు చెందిన సీనియర్ కార్యకర్త రాముల యాదవ్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి రాములు యాదవ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాములు యాదవ్ ఇటీవలే అనారోగ్యానికి గురయ్యారని చికిత్స పొందుతూ ఆకస్మిక మరణానికి లోనైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.