పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
PPM: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇవాళ జిల్లాలోని భాస్కర్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. పరీక్షల తీరును పర్యవేక్షించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయనతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.