వాడపల్లి వెంకన్న ఆలయ ఆదాయం వివరాలు

వాడపల్లి వెంకన్న ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి సోమవారం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 4.22 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో చక్రధరరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.