నేడు చిట్యాలకు మంద కృష్ణ రాక

NLG: చేయూత పింఛన్లను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం MRPS ఆధ్వర్యంలో చిట్యాలలో నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రానున్నట్లు MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరసాని గోపాల్ మాదిగ తెలిపారు. ఈ సమావేశానికి చేయూత పింఛన్ దారులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పేర్కొన్నారు.