VIDEO: ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా
KMR: తాడ్వాయి నుంచి చిట్యాల వెళ్లే దారిలో జంగ్లాదేమ చెరువు కట్ట హనుమాన్ గుడి వద్ద ఇవాళ ఆటో బోల్తా పడింది. ఆటో అదుపు తప్పి పల్టీ కొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఆటోలో సుమారు 10 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.